Posts

Showing posts from February, 2022

pavan kalyan visits Statue Of Equality: రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు?

Image
0 రామానుజాచార్యులకు హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల గ్రామంలో శంషాబాద్ విమానాశ్రయ దగ్గర్లో ఒక విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన విగ్రహం, ప్రపంచంలోని పెద్ద వాటిలో 26వది అవుతుందని దాన్ని నిర్మించిన వారు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయస్తులైన శ్రీ వైష్ణవ పీఠాధిపతి త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి తన ఆశ్రమ ప్రాంగణంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2014 నుంచి ఈ ప్రతిపాదనలు ఉండగా, ఇది 2021లో పూర్తయింది. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్య జన్మించి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతున్నట్లు ప్రకటించారు విగ్రహం ప్రత్యేకతలు: ఈ వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. రామానుజాచార్య చేతిలోని త్రిదండం (సాధారణంగా వైష్ణవ పీఠాధిపతుల చేతిలో ఉంటుంది) ఎత్తు 135 అడుగులు. మొత్తం వేదిక ఎత్తు 54 అడుగులు, పద్మ పీఠం ఎత్తు 27 అడుగులు. ఈ వేదికకు భద్రపీఠం అని పేరు పెట్టారు. కింద పీఠంతో కలపి 216 అడుగులు ఉంటుందీ విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు, కలువ రేక